Others

టీ సీరిస్ చేతికి ‘సాహో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా ఓ రేంజ్‌లో వుంది. దాంతో ఆయన సినిమాలపై అందరి దృష్టి పడింది. ‘సాహో’ సినిమా కూడా తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘సాహో’ హిందీ వెర్షన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సీరిస్ స్వంతం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని, టీ సీరీస్ హెడ్ భూషణ్ కుమార్ ప్రభాస్‌ను కలవడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్‌లోని పలు కీలక ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.