తమిళ రీమేక్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య బాలీవుడ్ బాద్షా కెరీర్ సాఫీగా సాగడం లేదు.. వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న ఆయన ఈసారి సేఫ్ ప్రాజెక్టు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించేది ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్. తమిళంలో జూలైలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన విక్రమ్ వేద ఈ చిత్రాన్ని అటు తెలుగులోను రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మరి వీళ్ళే దర్శకత్వం వహిస్తారా? లేదా అన్నది చూడాలి. ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని, భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఓ నిర్మాణ సంస్థ సిద్ధం అయిందట.