27న కణం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి ఎంసిఏతో ఆకట్టుకున్న సాయి పల్లవి ఇపుడు మరో భిన్నమైన కథాంశంతో తెరెక్కిన ‘కణం’లో నాగశౌర్యతో కలిసి కనిపించబోతోంది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో లైకాప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో ఎన్.వి.ఆర్ సినిమాస్ సమర్పణలో నిర్మితమైన కణంఈనెల27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ- సాయిపల్లవి, నాగశౌర్యలతో చేసిన కణం ఓ ఎమోషనల్ మూవీ. తల్లికి, కూతురుకి మధ్య వున్న బాంధవ్యాన్ని తెలియజేసే చిత్రమిది. చిత్రంలో వెరోనికా పాత్రలో నటించిన అమ్మాయి చాలా అద్భుతంగా నటించింది. తనకి ఏమి కావాలో స్పష్టంగా తెలిసిన దర్శకుడు ఉన్నప్పుడు మన పని సులువు అయిపోతుంది. దర్శకుడు విజయ్ ఎక్స్‌ట్రార్డినరీగా చిత్రాన్ని తెరకెక్కించారు. శామ్ సి.ఎస్. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిరవ్ షా కెమెరా సినిమాకు అదనపు బలం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రాన్ని 27న విడుదల చేస్తున్నాం అన్నారు. నిరవ్‌షా, శ్యామ్.సి.ఎస్, ఎల్.జయశ్రీ, స్టంట్ సిల్వ, విజయ్, సత్య, పట్టణం రషీద్, ఎం.ఆర్.రాజకృష్ణన్, కె.మణివర్మ, రామసుబ్బు, సప్నషా, వినయ్‌దేవ్, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం:లైకా ప్రొడక్షన్స్, దర్శకత్వం:విజయ్.