ప్రకృతే సాక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లుడు శీను, జయ జానకి నాయక లాంటి మాస్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైనమిక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సాక్ష్యం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ‘పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం.. ఖర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ’ అద్భుతమైన డైలాగ్‌తో డైలాగ్ రచయిత సాయిమాధవ్ బుర్రా వాయిస్ ఓవర్‌తో విడుదలైన టీజర్ రిచ్‌గా ఉంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ- అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తోపాటు ఆసక్తి కలిగించే స్క్రీన్‌ప్లే, సున్నితమైన కుటుంబ అనుబంధాలు అన్నీ టీజర్‌లో చూపించారు దర్శకుడు శ్రీవాస్. ఈ కథకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ కేటాయించడం జరిగింది. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు గ్రాఫిక్స్ సాక్ష్యంకు ప్రాణం. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం న్యూయార్క్, గ్రాండ్ కెన్యాస్, న్యూజెర్సీలోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్ర షూటింగ్ జరుగుతోంది. శ్రీవాస్ మునుపటి చిత్రాలతో పోల్చుకుంటే సాక్ష్యం చాలా భిన్నంగా ఉండబోతోంది. సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఎ.విల్సన్ అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, మీనా, శరత్‌కుమార్, రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, వెనె్నల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ:ఎ.ఎస్.ప్రకాష్, కూర్పు:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, మాటలు:సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్:పీటర్ హెయిన్స్, సంగీతం:హర్షవర్థన్, నిర్మాత:అభిషేక్ నామా, రచన, దర్శకత్వం:శ్రీవాస్.