టీజర్‌లో మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడి వెంకట లక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్, పిఎస్‌పి ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మేళా’. సూర్యతేజ్, ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను శనివారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో అతిథులుగా పాల్గొన్న నటుడు అలీ, ఎస్.గోపాల్‌రెడ్డిలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ- డైరెక్టర్ కిరణ్ మొదట ఇండస్ట్రీకి నటుడు అవ్వాలని వచ్చారు. కుదరక రైటర్ అయ్యారు. ఆ తరువాత నిర్మాత.. ఇప్పుడు ఈ మేళా చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అలాగే సూర్యతేజ వినాయకుడు చిత్రంతో పరిచయం అయినా, ఈ చిత్రంతో మంచి రేంజ్‌కు వెళ్లనున్నాడు. టైటిల్‌కు తగ్గట్టు సినిమా ఉంటుంది అన్నారు. దర్శకుడు కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ- మంచి కథను సపోర్టు చేసిన నిర్మాతలందరికీ నా కృతజ్ఞతలు. మొదటి నుంచి నాతో వున్న సూర్యకు థాంక్స్. మనం మాట్లాడటం కంటే పనే మాట్లాడాలనే దానికి ఈ సినిమానే నిదర్శనం. మూడు వేరియేషన్స్‌లో సినిమా ఉండనుంది. సినిమాకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు, అందరికీ ధన్యవాదాలు అన్నారు. హీరో సూర్యతేజ మాట్లాడుతూ- ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ అని చెప్పవచ్చు. డిఫరెంట్ జోనర్ టచ్‌లో వున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ ఇది నా డెబ్యూ మూవీ. టీమ్ అందరూ చాలా సపోర్టు చేశారు అన్నారు. ఈ కార్యక్రమానికి సెలెబ్ కనెక్ట్ అధినేతలు స్టీఫెన్, సుమన్, పిఎస్‌పి అధినేత ప్రకాష్‌లతోపాటు హీరోయిన్ సోని, దాసరి కిరణ్, విస్సు, మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు, రామ్ సుంకర, చంద్రకిరణ్, పెద్దిరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.