బంగారి బాలరాజు షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ్, కరోణ్య కత్రిన్‌ను హీరో హీరోయిన్లుగా నంది క్రియేషన్స్ పతాకంపై కె.ఎం.డి రఫీ, రెడ్డెం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ ఈ సందర్భంగా దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ- ‘‘డిసెంబర్ 11న షూటింగ్ ప్రారంభమై మొదటి షెడ్యూల్ అహోబిలం, కర్నూల్ రాక్ గార్డెన్, సోమశిల పరిసర ప్రాంతాల్లో టాకీ, రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. రెండో షెడ్యూల్ హైదరాబాద్, పరిగి, అరకు, ఎదులాబాద్ పరిసర ప్రాంతాలలో మిగతా టాకీ, పాటల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయింది. బంగారి బాలరాజు కథ విషయానికొస్తే.. కర్నూలు జిల్లాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా కథని రాసుకోవడం జరిగింది. చిత్రం ఆడియో ఓ పెద్ద హీరో చేతులమీదుగా త్వరలో విడుదల చేయనున్నాం. చిత్రాన్ని మే మూడోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన రెడ్డెం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ- ‘దర్శకుడు కోటేంద్ర మాకు కథ చెప్పగానే నచ్చి, వెంటనే షూటింగ్ ప్రారంభించాం. చెప్పినట్టుగానే చిత్రాన్ని అందంగా తెరకెక్కించారు. మే మూడోవారంలో వచ్చే మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాం’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చక్రవర్తి, ఆర్ట్: కృష్ణమాయ, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: చిన్నికృష్ణ-చిట్టిబాబు రెడ్డిపోగు, పాటలు: చిలకరెక్క గణేష్, ఫైట్స్: రామ్ సుంకర, కథ, మాలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోటేంద్ర దుద్యాల.