హారర్ జోనర్‌లో షీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై శే్వతామీనన్ ప్రధాన పాత్రలో పర్సా రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు రూపొందిస్తున్న చిత్రం ‘షీ’ (ఈజ్ వెయిటింగ్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఓ మంచి సేవా కార్యక్రమంతో ఈ సినిమాను ప్రారంభించామని, దర్శకుడు మంచి కథాకథనంతో సినిమాను తెరకెక్కిస్తున్నాడని, సాంకేతిక నిపుణులు అద్భుతమైన వారు దొరకడంతో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నామని అన్నారు. ఓ అందమైన ప్రేమకథకు హారర్ జోనర్‌ను జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలె, కెమెరా: అనిత్, ఆర్ట్: రామకృష్ణ, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పర్సా రమేష్‌మహేంద్ర.