త్వరలో నాన్న.. నేను.. వర్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఓండీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఆదర్శ్‌బాబు, పావని జంటగా అజ్మీరాచంద్ దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న చిత్రం ‘నాన్న.. నేను.. వర్ష’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, నిర్మాతకు తాను చెప్పిన కథ నచ్చడంతో సినిమా షూటింగ్ మొదలుపెట్టామని, కథకు కావలసిన అన్ని హంగులను అందించడంతో పూర్తి న్యాయం జరిగిందని అన్నారు. హీరో పక్కింటబ్బాయిలా కనిపించే ఈ చిత్రం క్లాస్ మాస్ ఆడియన్లను మెప్పిస్తుందని, పనె్నండు రకాల వేషాల్లో కథానాయకుడు గెటప్స్ బాగుంటాయని, యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను, సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. చలాకీ చంటి, స్నేహ, హారిక, గంగూబాయ్, దిలీప్, రాము, శివ, శోభ, శ్రావణ్, రఘు, మంగూలాల్, సమీర, అక్షయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్, నిర్మాత: ఎ.ఎస్.రావు, రచన, దర్శకత్వం: అజ్మీరాచంద్.