రానాతో మరోసారి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాల టెన్షన్‌నుండి తేజకు రిలీఫ్ ఇచ్చాడు హీరో రానా. తేజ దర్శకత్వంలో రానా నటించిన ‘నేనేరాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయం అందుకోవడంతో తేజకు మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం మహానటుడు అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా తరువాత తేజ మళ్లీ రానాతో ఓ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథను వినిపించాడని, కథ విన్న రానా కూడా ఓకే చెప్పినట్టు టాక్. ఈ సినిమాలో రానా ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కనిపిస్తాడని వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలు ఎక్కే అవకాశం ఉందట. దాంతోపాటు వెంకటేష్ హీరోగా తేజ మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో బహుశా ఈ సినిమా పట్టాలుఎక్కే అవకాశాలు లేనట్టు కనిపిస్తున్నాయి.