నా పేరు సూర్య - ఏ కథతోనూ పోల్చలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎవడిగోల వాడిదే’ సినిమాతో టాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి, అటుపై అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తూ తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ లగడపాటి శ్రీ్ధర్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు నిర్మించే ఈ బ్యానర్ నుండి తాజాగా వస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ జంటగా రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మే 4న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీ్ధర్ చెప్పిన విశేషాలు..
కథలో చాలా మలుపులు ఉంటాయి. మనసులను కదిలించే సినిమా. ఇది నా సినిమా కాదు బన్నీ సినిమా. అత్యుత్తమమైన సినిమాగా తెలుగులో నిలిచిపోతుంది. ఏ కథ తోనూ ఈ సినిమాను పోల్చలేం. ఈ సినిమా ద్వారా ఇండియాస్ ఎస్ ఆక్టర్‌గా అల్లు అర్జున్ నిలబడతాడు.. కరక్ట్‌గా చెప్పాలంటే బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌తో పోల్చదగ్గ హీరో బన్నీ.
అంచనాలు మించేలా..
అందరి అంచనాలు మించేలా ఉంటుంది ఈ సినిమా. అల్లు అర్జున్ మరో రేంజ్ నటన కనబరిచాడు. నేను విన్న కథలకు నా జడ్జిమెంట్‌కు మించి ఉంటుంది. నిజంగా మా బ్యానర్‌లో ఇలాంటి గొప్ప సినిమా చేయడం లక్కీ అని చెప్పాలి. నిజానికి యశ్‌రాజ్ ఫిలిమ్స్, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్‌లాంటి గొప్ప బ్యానర్‌లో రావాల్సిన సినిమా. నిజానికి ఈ కథను గీతాఆర్ట్స్ లాంటి బ్యానర్ ఉన్నా కూడా ఈ అవకాశం మాకు ఇవ్వడం ఆనందంగా ఉంది. అల్లుఅర్జున్ ఎప్పుడో ఒకసారి నాతో సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో ఈ సినిమాను నాకు ఇచ్చాడు. నిజంగా ఇది నాకు ఆస్కార్ అవార్డు వచ్చినంత గర్వంగా ఉంది.
నాగబాబు సపోర్ట్..
ఈ సినిమా స్పన్ ఎక్కువ కాబట్టి నాగబాబు లాంటి లీడర్ మనముందు ఉంటే బాగుంటుందని ఆయన ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన వచ్చాక సినిమా రేంజ్ పెరిగింది.
గొప్ప దర్శకుడిగా నిలుస్తాడు..
ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు రచయితగా పనిచేసిన వంశీ అద్భుతమైన కథ చెప్పాడు. నిజంగా గొప్ప కథ.. ఆరోజు నేను లారెన్స్ స్టైల్ సినిమా కథ విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో దానికి పది రెట్లు ఈ సినిమా కథను ఫీల్ అయ్యాను. లార్జ్ స్పన్ ఉన్న కథ. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం. దాంతోపాటు హిందీలో కూడా తరువాత ఉంటుంది.
టెక్నికల్ హైలెట్స్..
ఈ సినిమాలో పాటలు మంచి హిట్‌గా నిలిచాయి. విశాల్ శేఖర్ ఇండియాస్ టాప్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. వాళ్లతో చేయిస్తే బాగుంటుందని అనిపించి ఈ సినిమాకు వాళ్లతో చేయించాం. విశాల్ శేఖర్ సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసినవాళ్లు సంగీతం ఇచ్చారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇక హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కూడా అందంతోపాటు మంచి టాలెంట్ ఉన్న నటి. ఈ సినిమాతో మరో రేంజ్‌కి వెళుతుంది.
నా జీవితంలో..
ఈ సినిమాతో నిర్మాతగా నా రేంజ్ మారుతుంది. ఇన్నాళ్లు సినిమా పరిశ్రమలో ఉండి.. సినిమాలు తీసి బోర్‌కొట్టింది. ఇక ఆపేద్దాం అని అనుకునే లోగా కరక్ట్‌గా మంచి క్రేజీ ప్రాజెక్ట్‌పడింది. మనకు విటమిన్ టాబ్లెట్ పడ్డట్టు.. నిజంగా నాకు రీఎంట్రీ ఇచ్చే సినిమా అవుతుంది. అలాగే టెక్నికల్ విషయంలో కూడా మంచి టాలెంట్ ఉన్నవాళ్లు పనిచేసారు. ది బెస్ట్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఇప్పటివరకు ఈ ఫొటోగ్రాఫర్ తీసిన విషయంలో టాలీవుడ్‌లో ఇప్పటివరకు రాలేదు. అలాగే కొరియోగ్రాఫర్ విషయంలో బాలీవుడ్ నుండి వైబి మర్చంట్‌తో రెండు పాటలు, ఇంటర్నేషనల్ డాన్స్ మాస్టర్‌తో ఓ సాంగ్, ప్రేమ్క్ష్రిత్‌తో మరో సాంగ్ చేయించాం. ఇక సినిమా బడ్జెట్ పెరిగిందని అంటున్నాం. నా సినిమాల విషయంలో ఎప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించను. నేను చూసేది సినిమా బాగా వచ్చిందా లేదా అన్నది ఫైనల్. ఇక టీజర్‌తోనే ఓ రేంజ్ సంచలనం రేపిన ఈ సినిమా సమ్మర్ ప్రేక్షకులకు బెస్ట్ సమ్మర్‌గా నిలుస్తుంది.

-శ్రీ