పెళ్లి విలువ చెప్పే కళ్యాణవైభోగమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో పెళ్లిపాటే హైలెట్‌గా నిలుస్తుంది. ఈ పాటకోసం అందరం ఎంతో ఎఫర్ట్‌పెట్టి చేశాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లికి ఉన్న విలువేంటి అన్న కథాంశంతో సాగే ఈ చిత్రంలో నటించడం సంతోషంగా వుంది అని కథానాయకుడు నాగశౌర్య తెలిపారు. శ్రీ రంజిత్‌మూవీస్ పతాకంపై నాగశౌర్య, మాళవికానాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కథానాయకుడు నాగశౌర్య చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
‘దర్శకురాలు నందినీరెడ్డి ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలన్న కసితోనే చేశారు. నా రెండు మూడు సినిమాలు గతంలో ఫ్లాపు అయినా ఈ కథలో హీరోగా కచ్చితంగా సరిపోతానన్న ఉద్దేశ్యంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాలో నేను పెద్దగా నటించిందేమీ లేదు. దర్శకురాలు మంచి నటి కావడంతో కెమెరా ముందు ఆమె ఒకసారి నటించి చూపేవారు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను ఇమిటేట్ చేసేవాణ్ణి అంతే. నటన విషయంలో పెద్దగా కష్టపడలేదు. నిర్మాత దామోదర్ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్. ఆయనకు కథ నచ్చితే చాలు.. ఎన్ని కష్టాలైనా భరించి సినిమా చేస్తారు. ఈ సినిమాకు కూడా అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా కానీ వేటినీ పట్టించుకోలేదు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఆ సినిమాలో పాటలు ఎంత హిట్ అయ్యాడో అందరికీ తెలుసు. ఈ సినిమా పాటలు కూడా అంతే ఆదరణ పొందుతాయి. ముఖ్యంగా పెళ్లిపాటే సినిమాకు హైలెట్. నా పాత్ర పేరు శౌర్య. పెళ్లీ గిళ్లీ వద్దనుకునే ఓ మోడ్రన్ కుర్రాడు పెళ్లైన తర్వాత ప్రేమానుబంధాల గురించి తెలుసుకుంటాడు. పెళ్లి ప్రాధాన్యత గురించి చెప్పడమే సినిమా ప్రధాన ఉద్దేశ్యం. పెళ్లి అంటే విడిపోవడం కాదు. అందరూ కలసి ఆనందంగా జీవించడమే అని చెప్పిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనక్ట్ అవుతుంది. ఓ మంచి ఫ్యామిలీ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న యువతకు ఈ చిత్రం నచ్చుతుంది. సెంటిమెంటల్ మూవీగా కూడా దర్శకురాలు సినిమాను తీర్చిదిద్దారు. ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. దీవించాలని కోరుకుంటున్నా. తరువాతి చిత్రాలుగా రామరాజు దర్శకత్వంలో ఒక మనసులో అనే సినిమాలో నటిస్తున్నాను. షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి రూపొందిస్తున్న ‘జో అచ్చుతానంద’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నా.

-ఎస్.డి