మహానటి పాటలొస్తున్నాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకాదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మే 1న పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ఇటీవలే విడుదలైన టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆణిముత్యాల్లాంటి పాటలుంటాయి. ఇప్పటికే మూగమనసులు పాట అందరికీ నచ్చింది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఉన్నతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు ఎస్.వి.రంగారావు పాత్రలో కన్పించనున్నారు. అలాగే నాగచైతన్య అక్కినేని పాత్ర పోషిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాం అన్నారు.