ప్రీ రిలీజ్ వేడుకహైదరాబాద్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శిరీషా శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. యాక్షన్‌కింగ్ అర్జున్, శరత్‌కుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని మే 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇటీవలే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా సరికొత్త లుక్‌లో కన్పిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 29న హైదరాబాద్‌లో జరపనున్నారట. ఈ ఫంక్షన్‌కి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటాడని, అలాగే మెగా ఫ్యామిలీ నుండి మరికొన్ని సర్‌ప్రైజ్‌లున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహించనున్నారట.