కొత్తకొత్తగా ఉన్నది షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పతాకంపై సమర్, అక్షిత, కిమాయ ప్రధాన తారాగణంగా సతీష్ గుండేటి దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, తోట గోపాల్ రూపొందిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఓ అందమైన ప్రేమకథ ముగ్గురి మధ్య సాగితే ఎలా వుంటుంది? అన్న పాయింట్‌తో ఈ చిత్రాన్ని ప్రేమించుకున్న తర్వాత, పెళ్లికి ముందు యువతీ యువకుల ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా రూపొందించామని నిర్మాతలు తెలిపారు. ప్రతి యువతీ యువకుడు ఈ చిత్రాన్ని చూసి తమ పాత్రే ఇదని అనుకుంటారని, ప్రేమికులకు ఓ అందమైన అనుభూతిని ఇచ్చే ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడవచ్చని దర్శకుడు సతీష్ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర హీరో హీరోయిన్లు పాల్గొని విశేషాలను తెలిపారు. రమేష్‌బాబు, తనికెళ్ల భరణి, దువ్వాసి మోహన్, గీతాంజలి, మధుమణి, విష్ణుప్రియ, శ్రీప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వంశీ, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: జి.కె, నిర్మాతలు: పేర్ల ప్రభాకర్, తోట గోపాల్, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: సురేష్ గుండేటి.