రాజమండ్రిలో చుట్టాలబ్బాయి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది కథానాయకుడుగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రాము తాళ్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి.’ ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవల తమ చిత్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పాట బ్యాంకాక్‌లో ఐదురోజులపాటు చిత్రీకరించామని, ఇప్పుడు రాజమండ్రిలో ఈనెల 20వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలిపారు. రాజమండ్రి, గోదావరి పరిసరాల్లో ఆది, నమితాప్రమోద్‌లపై పాటల చిత్రీకరణ, విలన్‌తో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నామని దర్శకుడు వీరభద్రమ్ అన్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చే ఈ చిత్రానికి థమన్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని, తనకు, ఆదికి సూపర్‌హిట్‌గా ఈ చిత్రం పేరుతెస్తుందని ఆయన అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణ్భగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్‌చంద్ర, రచ్చ రవి, గిరిధర్, అనితానాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.అరుణ్‌కుమార్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవానీప్రసాద్, సంగీతం: ఎస్.ఎస్. థమన్, నిర్మాతలు: వెంకట్ తలారి, రాము తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్.