పూర్తికావస్తున్న ఇట్లు మీ సరోజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయాన్, కాంచన జంటగా ప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ సరోజ’. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, ఆకాశంలో సగం స్ర్తిలదేనని, అలాంటి సమాజంలో వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు, దాడుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. నిజ జీవితంలో ఇలాంటి దాడులను ఎదుర్కొన్న కొందరి జీవితాల ఆధారంగా ఈ కథను రూపొందించుకున్నామని, ఆడది బ్రతకలేక వేశ్యగా మారితే పర్యవసానం సమాజంపై ఎలా ఉంటుంది అన్న కథను చర్చించామని తెలిపారు. సమాజానికి ఓ సందేశాత్మక చిత్రంగా సాగుతూ అందరికీ నచ్చేలా రూపొందిందని, నటీనటులు అందరూ పాత్రకు తగిన విధంగా నటించారని, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామని అన్నారు. ధన్‌రాజ్, విజయభాస్కర్, డి.వి.శ్రీను, ఆనంద్, రాజేష్, కృష్ణవేణి, మమత, జ్యోతి, వౌనిక తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్రకుమార్, సంగీతం: నందకిషోర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రసాద్‌రెడ్డి.