భిన్నమైన సినిమాలే చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆలస్యం అమృతం’ సినిమా రిలీజ్ సమయంలో నేను థియేటర్ దగ్గర ఉన్నపుడు ఒకతను నా దగ్గరకు వచ్చి సినిమా బాగాలేదు, అందుకనే వెళ్లిపోతున్నానని చెప్పాడు. నేను షాక్ అయ్యాను. అపుడే నిర్ణయించుకున్నాను, భిన్నమైన సినిమాల్లో నటించాలి’ అని అంటున్నాడు యువ హీరో నిఖిల్. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి వరుస విజయాలతో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు నిఖిల్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘శంకరాభరణం’. ఉదయ్‌నందనవనం దర్శకత్వంలో ఎం.వి.వి. సినిమా పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈనెల 4న విడుదలవుతున్న సందర్భంగా నిఖిల్‌తో ఇంటర్వ్యూ...
ఈ సినిమా ఎలా సెట్ అయింది?
ఓ రోజు కోన వెంకట్ ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మని చెప్పారు. చాలామంది స్టార్ హీరోలతో పనిచేసిన ఆయన నన్ను రమ్మన్నపుడు చాలా ఆనందమేసింది. దాంతో ఆఫీసుకు వెళ్ళాను. నీతో కలిసి ఓ సినిమా చేయాలని ఈ కథను చెప్పారు. కథ వినగానే మొత్తం కథ చెప్పగలరా అని అడిగాను. ఆయన రెడీ అయిన తరువాత చెబుతానని చెప్పారు. హిందీలో వచ్చిన ‘్ఫస్‌గయారే ఒబామా’ సినిమా రీమేక్ హక్కులు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాం. నిజానికి ఇలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు.
* మీ పాత్ర గురించి?
- ఇందులో నాది టిపికల్ ఎన్‌ఆర్‌ఐ పాత్ర. అలాంటివాడు బీహార్ లాంటి ప్రాంతానికి వస్తే ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా. సినిమా మొత్తం బీహార్‌లోని చాలా ప్రాంతాల్లో చేశాం.
* దీనికోసం ప్రత్యేకంగా
హోమ్‌వర్క్ చేశారా?
- అలాంటిది ఏం లేదు. ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమా తరువాత అమెరికా వెళ్లాను. అక్కడ న్యూయార్క్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఓ కోర్సు చేశాను. ఆ సమయంలో నేను పంపిన ఫొటో కోనగారికి నచ్చి ఈ పాత్రకు ఇలాగే వుండాలని చెప్పారు. దాంతో అలాగే చేశాను.
* టైటిల్‌కు, కథకు సంబంధం వుందా?
- ఇది ఫ్యామిలీ, యాక్షన్, లవ్, మాఫియా.. ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ఈ టైటిల్ గురించి కోనగారు ‘శంకరాభరణం’ అని చెప్పగానే షాక్ అయ్యాను. అందరికీ తెలిసిన టైటిల్ అయితే బాగుంటుదని, ప్రేక్షకులు తొందరగా రీచ్ అవుతుందని ఈ టైటిల్‌ను పెట్టారు. విశ్వనాధ్‌గారు కూడా బాగుందని అన్నారు. మేము బూతు సినిమా తీయలేదు కాబట్టి ఈ టైటిల్ పెట్టాం.
* రీమేక్ కోసం మార్పులు చేశారా?
- హిందీలో వచ్చిన ‘్ఫస్‌గయారే ఒబామా’ పెద్ద హిట్. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ తీసుకుని దాని చుట్టూ కథ అల్లారు. కథ చాలా డిఫరెంట్‌గా వుంటుంది.
* కథల విషయంలో
ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు?
- ‘ఆలస్యం అమృతం’ సమయంలో ఒకతను నా దగ్గరకు వచ్చి సినిమా బాగోలేదు, అందుకే మధ్యలోనే వెళ్లిపోతున్నానని చెప్పాడు. అపుడు షాక్ అయ్యా. ఇకపై నేను సినిమాలు విభిన్నంగా వుండాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ ఒకేరకమైన సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. కాబట్టి కొత్తగా వుండే కథల్నే ఎంచుకుంటున్నాను.
* హీరోయిన్ గురించి?
- సినిమాలో నందిత చాలా అద్భుతంగా నటించింది. ఆమెతోపాటు అంజలి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె ఓ డాన్ పాత్రలో కన్పిస్తుంది.
* తదుపరి చిత్రాలు?
- వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఇందులో ముగ్గురు హీరోయిన్లు వుంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా అవికాగోర్ ఎంపికైంది. ఇది ఫాంటసీ సినిమా. కథ చాలా ఎగ్జైటింగ్‌గా వుంటుంది. దీంతోపాటు ‘కార్తికేయ-2’ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

-శ్రీ