పెళ్లిభోజనంలాంటి దావత్ ఏ షాదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాబా ప్రొడక్షన్స్ పతాకంపై సయ్యద్ హుస్సేన్ దర్శకత్వంలో సమీఉల్లాఫయాజ్, సయ్యద్ వసీమ్‌యాబా రూపొందించిన చిత్రం ‘దావత్ ఏ షాదీ.’ హైదరాబాదీ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. అద్నాన్ సాజిద్‌ఖాన్, మస్త్‌అలీ, ఫిరోజ్‌ఖాన్, మాధవి, మనీషా, కావ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ఇప్పటివరకూ వచ్చిన హైదరాబాదీ సినిమాలను కొంతమంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, కానీ ఈ చిత్రాన్ని చూడడానికి అన్నివర్గాలవారు వస్తారని తెలిపారు. ఓ పసందైన పెళ్లిభోజనంలా ఈ చిత్రం ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో మస్త్‌అలీ, ఫిరోజ్‌ఖాన్, చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: క్రాంతి, కెమెరా: వేలూరు మురళీకృష్ణ, సంగీతం: ఎం.జి.కె.ప్రవీణ్, నిర్మాతలు: సమీఉల్లా ఫయాజ్, సయ్యద్ వసీమ్ యాబా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సయ్యద్ హుస్సేన్.