నయనతార గుడ్ ఈవెనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన ‘నంబేండ’ చిత్రాన్ని తెలుగులో ‘గుడ్ ఈవెనింగ్’గా అందిస్తున్నారు. భద్రకాళి ఫిలిమ్స్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎ.జగదీష్. చిత్ర విశేషాలను నిర్మాత ప్రసాద్ వివరిస్తూ, కథానాయిక తన ప్రేమను ఒప్పుకోడానికి హీరో పడే అష్టకష్టాలు చివరికి ఆమెను ఒప్పించి, పెళ్లికి సిద్ధమైతే తాను 10 రోజులపాటు జైలు జీవితం అనుభవించానని ఆమె చెప్పడంతో కథ మలుపుతిరుగుతుందని అన్నారు. ఆమె కథేంటి? ఫ్లాష్‌బ్యాక్‌లో దాగివున్న నిజాలు ఏంటి? ఆమె ప్రేమను పొందడానికి హీరో చేసే సాహసం ఎలా వుంటుంది? అనేదే ఈ చిత్ర కథాంశమని, సంతానం కడుపుబ్బ నవ్విస్తాడని, లవ్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ఈనెలలోనే ఆడియోను, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కరుణాకరన్, షాయాజీషిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వెనె్నలకంటి, పాటలు: చంద్రబోస్, శివగణేష్, సంగీతం: హారిస్ జయరాజ్, కెమెరా: బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత: భద్రకాళి ప్రసాద్, దర్శకత్వం: ఎ.జగదీష్.