డబుల్ బొనాంజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 20న యంగ్ టైగర్ అభిమానులకు డబుల్ బొనాంజ గిఫ్ట్‌గా రానుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 25వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆ రోజు విడుదల చేయనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా టైటిల్‌పై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ‘అసామాన్యుడు’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్‌పై యూనిట్ వర్గాలనుండి ఎలాంటి సమాచారం రాలేదు. ఇక ఎన్టీఆర్ - చరణ్‌లతో దర్శక ధీరుడు రాజవౌళి తెరకెక్కించే భారీ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ రెండు క్రేజీ చిత్రాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లకోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.