స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మహిళా కబడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మహిళా కబడ్డీ’. రచనా స్మిత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన మూడు పాటలు యూట్యూబ్‌లో పది లక్షలకుపైగా వ్యూస్‌తో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్‌లో ఆడియో సక్సెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- మా బేనర్‌లో చాలా గ్యాప్ తర్వాత నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. మహిళలు ఎందులో తక్కువ కాదనే కానె్సప్ట్‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఒక పల్లెటూరు అమ్మాయి భారతదేశం గర్వపడే స్థాయిలో కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగిందనేది మెయిన్ కథాంశం. మధుప్రియ, మంగ్లీ, గీతామాధురి పాడిన పాటలు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధుప్రియ పాడిన పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. మరో రెండు పాటలను మధుప్రియ, గీతా మాధురితో పాడించనున్నాం. త్వరలో వాటిని విడుదల చేస్తాం. రాజ్‌కిరణ్‌కి ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి బ్రేక్ వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ దశలో ఉంది అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముత్యాల రాందాస్ మాట్లాడుతూ- ఈ చిత్రంలోని పాటలు యూట్యూబ్‌లో హల్‌చల్ చేయడం అభినందనీయం. రామకృష్ణగౌడ్ దర్శకత్వం వహిస్తూ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్నారు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్: రాజ్‌కిరణ్, కెమెరా: రాజు, లిరిక్స్: పైడిశెట్టి రామ్, రామారావు, శ్రీనివాస్‌గౌడ్.