4న జంబలకిడి పంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జంబలకిడి పంబ’అనే పేరు వినగానే సీనియర్ నరేశ్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ చేసిన నవ్వుల సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో మరో హిలేరియస్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’, ఆనందోబ్రహ్మ వంటి వైవిధ్యమున్న చిత్రాలతో హీరోగా మెప్పించిన శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సిద్ధిబద్నాని కథానాయిక. పోసాని కృష్ణమురళి, వెనె్నల కిశోర్ కీలక పాత్రధారులు. జె.బి.మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి, ఎస్. నిర్మాతలు. ఈ సినిమా జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎస్ మాట్లాడుతూ- ‘మా బ్యానర్‌లో రూపొందుతోన్న ‘జంబలకిడి పంబ’తో ప్రేక్షకులు మరోసారి లాఫింగ్ రైడ్ చేయనున్నారు. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. షూటింగ్ పూర్తయ్యింది. సినిమా చిత్రీకరణతోపాటు సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు జె.బి.మురళీకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈవీవీగారు తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదంటే కారణం అందులోని కామెడీయే. మరోసారి కడుపుబ్బ నవ్వించే కామెడీతో అదే టైటిల్‌తో వస్తున్నాం. బాడీస్వాపింగ్ అనే కానె్సప్ట్‌వల్ల హీరో హీరోయిన్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే కథతో ఈ చిత్రం తెరకెక్కించాం’ అన్నారు.