15న దివ్యమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహ్ మాయా ఎంటర్‌టైన్‌మెంట్స్, గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘దివ్యమణి’. ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా వైశాలి, కిమయా హీరోయిన్స్‌గా దివ్యమణి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సురేష్ కమల్ మాట్లాడుతూ- నటుడిగా ఇది నా తొలి చిత్రం. గిరిధర్ కథే ఈ చిత్రానికి హైలెట్. యాక్షన్ అంతా నేను ఒరిజినల్‌గా చేశాను. ఈ సినిమా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ- దివ్యమణి సోషియో ఫాంటసీ చిత్రం బ్యాంకాక్, పట్టాయా, నొమెన్స్ ఐలాండ్, హైదరాబాద్, బెంగుళూరు లొకేషన్స్‌లో తెరకెక్కించాం. ఈ సినిమాకు మాస్టర్ కమల్ స్టంట్స్ హైలెట్‌గా నిలుస్తాయి. జూన్ 15న సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, కెమెరా: రాజేష్ కాటా, ఫైట్స్: జైక (్థయ్‌లాండ్), రామ్‌లక్ష్మణ్, కథ, దర్శకత్వం: గిరిధర్ గోపాల్.