కళ్యాణ్ దేవ్ డబ్బింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్ర నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. హీరో కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ ప్రారంభించారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌దేవ్‌కు జోడీగా ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయర్ నటించారు. చిత్ర టైటిల్, రిలీజ్‌ను త్వరలో ప్రకటిస్తారు. రాకేష్ శశి ఒక వినూత్నమైన కానె్సప్ట్‌తో కథ అందించిన ఈ చిత్రం ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. సెంథిల్‌కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు. రంగస్థలం చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తనికెళ్లభరణి, మురళీశర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు) ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత: రజనీ కొర్రపాటి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి.