సాయిధరమ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా హీరో సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్‌లు ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తేజ్ ఐ లవ్ యు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్‌లో వీరిద్దరి జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. జంట చూసేందుకు ఫ్రెష్‌గా ఉన్నారని, ఆన్‌స్క్రీన్‌మీద కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందనే కాంప్లిమెంట్స్ కూడా అందాయి. దీంతో దర్శకుడు కిశోర్ తిరుమల తేజ్‌తో చేయాలనుకుంటున్న సినిమాలో కూడా అనుపమనే కథానాయికగా తీసుకోవాలని అనుకుంటున్నారట. ధరమ్‌తేజ్, అనుపమలు కూడా కిశోర్ కథ పట్ల, అందులో తమ పాత్రల పట్ల ఇంప్రెస్ అయి సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. అంతేగాక ఈ చిత్రంలో ‘హలో’ ఫేం కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటించనుందని సమాచారం.