4న బంగారుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమలీల సినిమా పతాకంపై ఎన్.హెచ్.ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బంగారుపాదం’. దయ, జ్యోతిశ్రీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 4న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఎన్.హెచ్.ప్రసాద్ మాట్లాడుతూ, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ‘బంగారుపాదం’ సాగుతుందని, వస్తువులకు మనుషులకు వున్న సంబంధాలను ఈ చిత్రంలో తెలిపామన్నారు. కాలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి ఒంటరిగా తన జీవితాన్ని ఎలా గడిపాడనే కథాంశంతో ప్రేక్షకులను ఆలోచింపచేసేలా తెరకెక్కించామని, జోశ్యభట్ల అందించిన పాటలు అందరికీ నచ్చుతాయని తెలిపారు. ఇటీవల ఈ చిత్రాన్ని మీడియాకు ప్రదర్శించామని, అందరివద్దనుండి పాజిటివ్ టాక్ రావడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఈ నెల 4న విడుదల కానున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:శ్రీనుబాబు, సంగీతం:జోశ్యభట్ల, కెమెరా:రవికుమార్, కథ, మాటలు, నిర్మాత, దర్శకత్వం:ఎన్.హెచ్.ప్రసాద్.