రెండో బిగ్‌బాస్ నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిగ్‌బాస్’ 2017లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బుల్లితెర రియాలిటీ షో. హిందీలో విజయం సాధించిన ఈ షోని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని మొదటి సీజన్ ఆరంభంలో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ మొదటి సీజన్ సూపర్‌హిట్ అయింది. దీని తరువాత ప్రేక్షకుల చూపు బిగ్‌బాస్ సెకెండ్ సీజన్‌పై పడింది. అయితే ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా సెకెండ్ సీజన్ నుంచి తప్పుకున్నారు. దీంతో సెకెండ్ సీజన్‌కు ఎవరు హోస్ట్ చేస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా గమనించసాగారు. ఈ క్రమంలో హోస్ట్‌గా రానా, అల్లు అర్జున్, నాని పేర్లు తెరమీదకు వచ్చాయి. వీటిలో ప్రముఖంగా నాచురల్ స్టార్ నాని పేరు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. చివరకు నానినే బిగ్‌బాస్ సెకెండ్ సీజన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడని అధికారికంగా ప్రకటించింది.