వీరమహాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టివ్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీలియోన్ నటిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం వీరమహాదేవి. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి ఐదు భాషల్లో షూటింగ్ జరుపుకుంటుంది. సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకుంటున్నారు. నాజర్ మరియు తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లోని ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. యుద్ధ సన్నివేశాల కొరకు సుమారు 1000 గుర్రాలు మరియు ఏనుగులు ఉన్నందున నటీనటులకు గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తున్నాం. సన్నీలియోన్ దుస్తులు దక్షిణ భారత సంప్రదాయంలో వుంటాయి.
వీటిని ముంబైలో తయారు చేయిస్తున్నాం. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. గ్రాఫిక్స్ ఎక్కువగా వున్నందున కెనడాలోని కంపెనీ మరియు ఇక్కడ ఒక ముఖ్య కంపెనీ కలిసి పనిచేస్తున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మరియు గాడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్ చిత్రాలకు పనిచేసినవారు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. గ్రాఫిక్స్ కోసం సుమారు రూ.40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ చిత్రం కోసం సన్నీలియోన్ 150 రోజులు కేటాయించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదల చేస్తున్నాం అని తెలిపారు.