పాటల్లో సంజీవని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.నివాస్ ప్రొడ్యూసర్‌గా, రవి వీడే దర్శకుడిగా మనోజ్ చందర్, అనురాగ్ దేవ్, శే్వత ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ మొట్టమొదటిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని సమర్థవంతంగా వాడి అత్యంత భారీగా నివాస్ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించిన చిత్రం ‘సంజీవని’. శరవణ్.కె.కె సంగీతం అందించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కె.ఎం.రాధాకృష్ణ ఆడియోను విడుదల చేసి తొలి సీడీని వి.విజయేంద్రప్రసాద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వి.విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ- ఈ సినిమా చేసిన యూనిట్ కష్టం, సాహసం చూస్తుంటే థ్రిల్ ఫీలయ్యాను. ఇలాంటి సినిమా తెలుగులో వస్తున్నందుకు హ్యాపీగా ఫీలయ్యాను. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అన్నారు. కె.ఎం.రాధాకృష్ణ మాట్లాడుతూ- హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తగ్గకుండా తీసినట్లు కనపడుతోంది. సినిమాపై నమ్మకం, పాషన్‌తో సినిమా చేసిన నిర్మాత జి.నివాస్‌ను అభినందిస్తున్నాను. శరవణ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బావున్నాయి అన్నారు. రవి వీడే మాట్లాడుతూ- పర్వతారోహకుడు, అర్జున అవార్డు గ్రహీత అయిన శేఖర్‌బాబు బచ్చేనపల్లి మా టీంతో అసోసియేట్ అయి లొకేషన్స్ విషయంలో ఎంతగానో సహకారాన్ని అందించారు. ఆయనకు ఈ సందర్భంగా నా థాంక్స్. ఇందులో నటించిన నటీనటులందరికీ పదిరోజులపాటు శిక్షణ ఇప్పించాను. మూవీ విఎఫ్‌ఎక్స్ కోసం ఏడు స్టూడియోల్లో వర్క్ చేయించాం. శరవణ్ అద్భుతమైన సంగీతం అందించారు. నివాస్ సపోర్టు లేకపోతే ఈ సినిమా లేదు. డిఫరెంట్ మూవీ చేద్దామని ఆలోచన చేసి సమయం తీసుకుని మా యూనిట్ వెనుక నిలబడి సహకారం అందించారు అన్నారు.