రెగ్యులర్ షూటింగ్‌లో వ్యోమగామి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మొదటి ప్రయత్నంగా రూపొందుతున్న స్పేస్ సినిమా ఇటీవల హైద్రాబాద్‌లో ప్రారంభం అయింది. ఇప్పటికే వేసిన భారీ స్పేస్ సెట్స్‌లో షూటింగ్ మొదలుపెట్టారు. ఘాజి సినిమాతో జాతీయ దర్శకుడిగా గుర్తింపుతెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి తన రెండో ప్రయత్నంగా స్పేస్ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నాడు. మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా కనిపిస్తాడని, అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ సరసన అథితిరావు హైదరి, లావణ్యత్రిపాఠి నటిస్తున్నారు. నిజంగా తెలుగులో ఇలాంటి సినిమా చేయడం గొప్ప సాహసం అని చెప్పాలి. ముఖ్యంగా వరుణ్‌తేజ్ భిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంటున్న వరుణ్ చేస్తున్న మరో మంచి ప్రయోగమిది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని దసరాకు విడుదలచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. క్రిష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.