అభిమన్యుడు వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.సరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 1న ‘అభిమన్యుడు’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మాస్ హీరో విశాల్ మాట్లాడుతూ.. ‘తమిళ్’లో ‘ఇరుంబుతెరై’ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ‘అభిమన్యుడు’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కూడా తమిళ్ లాగే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుందని, తెలుగులో కూడా నా కెరీర్‌నే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. నిర్మాత జి.హరి మాట్లాడుతూ ‘జూన్ 1న మా అభిమన్యుడు’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మే 25న ఆడియో ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం అన్నారు.