రాజుగాడు వచ్చేస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో రాజ్‌తరుణ్ ‘రాజుగాడు’ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు, చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈడోరకం ఆడోరకం, అంధగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం కావడంతో రాజుగాడుపై భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించగా, రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీతో ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. ఆడియో విడుదల, ప్రీ రిలీజ్ వేడుకలను త్వరలో జరపనున్నారు. రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావు రమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ్భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యూమ్, అదుర్స్ రఘు, అభి, ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి నటిస్తున్నారు.