మాస్‌కు క్లాస్‌కు నేల టిక్కెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం నేల టిక్కెట్టు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా శుక్రవారం విడుదలవుతుంది. మాళవిక శర్మ హీరోయిన్. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర యూనిట్ మీడియా మీట్ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం, రవితేజ తనకిచ్చిన సపోర్టును మరిచిపోలేనిది. కెరీర్ మొదట్లో రవితేజకి ఈ కథ చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే సినిమా చేస్తానని తెలిపారు. అప్పుడే నేను సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు చేశాను. ఆ తరువాత రవితేజ ఒప్పుకున్న రెండు సినిమాలు పూర్తయ్యాక నాతో సినిమా మొదలుపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాత తాళ్లూరి మాట్లాడుతూ- 95 రోజులు కష్టపడి ఈ సినిమాను పూర్తిచేశామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. రవితేజతో మంచి స్నేహం ఉందని, అందుకే ఆయనతో మరో సినిమా కూడా నిర్మిస్తున్నానని అన్నారు. అలాగే పవన్‌కళ్యాణ్ ఈ సినిమా ఆడియో వేడుకకు రావడం ఆనందంగా ఉందని, పవన్ మంచి ఫ్రెండ్ అని తెలిపాడు. నేల టిక్కెట్టు ప్రతి ఒక్కరికీ మంచి వినోదాన్ని పంచుతుందని అన్నారు.