త్వరలో సతీ తిమ్మమాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రాత్మక కథాంశంతో ఎస్‌ఎస్‌ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం రూపొందించిన చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఏడెకరాల భూమిలో విశిష్ట చరిత్రగల తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యయని, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిందని, అటువంటి ఈ మాను చరిత్రను తెరకెక్కించడం ఓ శుభ సంకల్పంగా తాము భావిస్తున్నామని, శివరాత్రికి తిమ్మమ్మ మానువద్ద జరిగే ఉత్సవాలు మూడురోజులపాటు నిర్వహిస్తారని, అటువంటి విశిష్టత కలిగిన ఈ చరిత్రను సినిమాగా రూపొందించామని నిర్మాత తెలిపారు. భారీ గ్రాఫిక్స్‌తో నిర్మించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. వెంకట్, వినోద్‌కుమార్, ప్రభాకర్, రంగనాథ్, చంద్రమోహన్, రాజశ్రీ, జూ.రేలంగి తదితరులు నటించిన ఈ చితానికి సంగీతం: బండారు దానయ్యకవి, కెమెరా: షాహిద్ హుస్సేన్, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: పెద్దరాసు సుబ్రహ్మణ్యం, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.