పోస్ట్ ప్రొడక్షన్‌లో క్రీస్తు యేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.ఎస్.ఆర్. ప్రధాన పాత్రలో ఎస్.ఆర్.కుమార్‌రాజా దర్శకత్వంలో చంద్ర పార్వతమ్మ రూపొందిస్తున్న చిత్రం ‘క్రీస్తు యేసు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని చారిత్రాత్మక చిత్రంగా అందించే ప్రయత్నం చేస్తున్నామని, భారతదేశ చలనచిత్ర రంగంలో ఓ మైలురాయిగా నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు. బైబిల్ ఆధారంగా స్క్రీన్‌ప్లే పాటలు రాసుకున్నామని, పెద్దవాళ్లను ఏ దేశంలో గౌరవిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉంటుందన్న క్రీస్తు బోధనలే ఈ సినిమాలో ప్రధానంగా ఉంటాయని అన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి క్రీస్తు భక్తుడు ఆనందిస్తాడని, ఇప్పటికే ఈ సినిమాలో పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు. దర్శకుడు చిత్రాన్ని అందరికీ నచ్చేలా తీర్చిదిద్దారని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. లక్ష్మి, పాస్టర్ శ్యామ్‌సన్, సంగాల కిరణ్‌కుమార్, జయరాజ్, చెరుకూరి సాంబశివరావు, చెర్రీ, సాయి, లవకుశ ఫేమ్ సుబ్రహ్మణ్యం, పడాల ప్రసాద్, కత్రిన, దీప తదితరులు నటిస్తున్నరు .