రుస్తుంపైనే ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వున్న ఇలియానా ఒక్కసారిగా తెలుగు చిత్రాలకు టాటా చెప్పేసి, బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది. ఆమె నటించిన తొలి చిత్రం ‘బర్ఫీ’ సూపర్‌హిట్ అవడంతో ఇల్లీ బేబీ ఇక బాలీవుడ్‌లో కూడా సూపర్‌స్టార్‌గా ఎదుగుతుందని అందరూ ఆశించారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఒక్క సినిమాతోనే స్టార్ అయిన ఇలియానా, ఆ తర్వాత నాలుగేళ్ళలో కేవలం మూడు చిత్రాలలో అవకాశాలను మాత్రమే దక్కించుకోగలిగింది. అవి కూడా ఆమెకు ఏమాత్రం ప్లస్‌కాలేదు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తున్న బాలీవుడ్‌లో ఇలియానాకు సరైన పట్టు దొరకడం లేదు. దీంతో బాలీవుడ్‌లో ఇలియానా శకం ముగుస్తుందా అని సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు. ఇలియానా ఆశలన్నీ అక్షయ్‌కుమార్‌తో నటించిన ‘రుస్తుం’ చిత్రంపైనే ఉన్నాయి. ఈ సినిమా ఆమెకు తాడోపేడో తేల్చేస్తుంది. ఈ చిత్రం ఆగస్టులో విడుదలయ్యాక హిట్ అయితే ఓకె, లేదా అదే చివరి చిత్రవౌతుందా అని అంచనాలు వేస్తున్నారు. చూద్దాం!