హృదయం ఊగిసలాడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై రావంత్, పావని జంటగా ధనుంజయ్ దర్శకత్వంలో పల్ల రమణాయాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, చీరాల పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేశామని, రాజ్‌కిరణ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, హీరో కొత్తవాడైనా చక్కగా నటిస్తున్నాడని తెలిపారు. మంచి ఫీల్‌తో ఉన్న ఈ టైటిల్‌కు న్యాయం చేయడానికి కథాకథనాల పరంగా కృషిచేస్తున్నామని, ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నామని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాసరావు కిలారి, పాటలు: కాంచనపల్లి రాజేంద్రరాజు, ఎం.రామారావు, గిరిధర్ రాగోలు, వి.ఎస్.ప్రభాకర్, సంగీతం: రాజ్‌కిరణ్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: పల్లా రమణాయాదవ్, కథ, కెమెరా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధనుంజయ్.