మనసును తాకే గుప్పెడంత ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్‌లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. సాయిరోనక్, అతిథి సింగ్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వినోద్ లింగాల మాట్లాడుతూ, అనుభూతి ప్రధానంగా ఫస్ట్‌లవ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని, హృదయానికి హత్తుకునే ఫీల్‌గుడ్ మూవీగా చిత్రీకరించామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో తొలి ప్రేమ మరిచిపోలేని అనుభూతి లాంటిదని, అటువంటి అనుభూతితో గుప్పెడంత ప్రేమ చిత్రాన్ని రూపొందించామన్నారు. వినూత్నమైన కథాకథనంతో విజువల్ ట్రీట్‌గా చక్కని సంగీతంతో సాగిపోతే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించామని, ప్రస్తుత యువత ఈ చిత్రంలోని ప్రతి పాత్రను తమను తాము చూసుకుంటారని, స్వచ్ఛమైన అనుభూతులకు అద్దంలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. షిల్లాంగ్, చిరపుంజి, మేఘాలయ లాంటి ప్రదేశాలలోనే కాక ఈశాన్య భారతంలోను పలు కొత్త లొకేషన్లలోను షూటింగ్ చేశామని, అలాగే హైదరాబాద్, గుంటూరు, వరంగల్‌లలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించామని తెలిపారు. యువతకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ సుందర్, కెమెరా: సంజయ్ లోక్‌నాథ్, పాటలు: వనమాలి, శ్రీమణి, ఎడిటింగ్: బవవ పైడిరెడ్డి, ఆర్ట్: రాజీవ్ నాయర్, దర్శకత్వం: వినోద్ లింగాల.