నవ్వించే జంబలకిడి పంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధిఇద్నాని హీరోహీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జె.బి.మురళి కృష్ణ దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం ‘జంబలకిడి పంబ’. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లరి నరేశ్, శ్రీనివాసరెడ్డి, సిద్ధిఇద్నాని, డైరెక్టర్ జె.బి.మురళీకృష్ణ, నిర్మాతలు రవి, జోజో జోస్, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్, వెంకట్రామిరెడ్డి, అనిల్‌కుమార్, రాజ్‌కందుకూరి, వెనె్నలకిశోర్, తదితరులు పాల్గొన్నారు. బిజెపి ఉత్తరాంధ్ర ఎంఎల్‌సి మాధవ్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదలచేశారు. బ్యానర్ లోగోను బీరం సుధాకర్‌రెడ్డి విడుదలచేశారు. అనంతరం అల్లరి నరేశ్ మాట్లాడుతూ..‘‘మేడమీద అబ్బాయి సినిమానుండి మనుగారితో మంచి పరిచయం ఉంది. కష్టపడి, కసితో చేసిన సినిమా ఇది. జంబలకిడి పంబ అనే టైటిల్ పెడితే అందరూ తిట్టారని దర్శకుడు మను ఇందాక అన్నారు. ఇంతకుముందు మేం అహనా పెళ్ళంట అనే టైటిల్ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని అలాగే తిట్టారు. అయితే మేం హిట్ కొట్టాం. రెండు సినిమాలకు సంబంధం ఉండదు. ఫ్రెష్ సబ్జెక్ట్. ఆ సినిమా ఎంత విజయం సాధించిందో ఈ సినిమా అంతే పెద్ద సక్సెస్ కావాలి. గోపీసుందర్ గారు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ సినిమాకు ఆయన సంగీతం అందించారు. నిర్మాతలకు అభినందనలు. సినిమాపై నేను నమ్మకంగా ఉన్నాం. 22న నా నమ్మకం నిజమవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. నిర్మాత రవి మాట్లాడుతూ.. నా తొలి ప్రొడక్షన్ ఇది. మనుగారు చాలా బాగా మూవీ తీశారు. శ్రీనివాసరెడ్డిగారు పెద్ద ఎసెట్ అయ్యారు.