ట్రైలర్‌లో ప్రేమెంత పనిచేసే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో జెఎస్‌ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ సినిమా ట్రైలర్ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో శ్రీకాంత్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, ఒ.కళ్యాణ్, డాలి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మామూలుగా ప్రేమలు కాలేజీ, బస్టాండ్, రైళ్లలో మొదలవుతాయి. కానీ ఈ సినిమాలోని ప్రేమ ఎలా మొదలైందో చూస్తే మీకే కొత్తగా అనిపిస్తుంది. అలాగే ప్రేమని కులం, మతం అంతస్తు విడదీస్తుంది. కానీ ఈ సినిమాలో ఏం జరుగుతుందో చూడాలి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ- శ్రీనివాసరావు దర్శకత్వంలో నేను ఓ చిత్రం తీశాను. చాలా మంచి దర్శకుడు. వాళ్ళ అబ్బాయి హరికృష్ణ హీరోగా పరిచయం అవ్వడం ఆనందంగా వుంది. తను మంచి నటుడు, డాన్సర్ కూడా. తప్పకుండా హీరోగా పేరు తెచ్చుకుంటాడు అన్నారు. దర్శకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ- కొత్తవాళ్ళతో తీసిన సినిమా ఇది. మా అబ్బయిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాకు వాయిస్‌ఓవర్ ఇచ్చిన జగపతిబాబుకు ధన్యవాదాలు. నిజ జీవితంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాం. ఇది నా తొమ్మిదవ చిత్రం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- జొన్నలగడ్డ మంచి ప్రయత్నం చేస్తున్నాడు. హరికృష్ణ నటన, డాన్సులతోను ఆకట్టుకున్నాడు. ట్రైల్ బాగుంది. తప్పకుండా సక్సెస్ కావాలి అన్నారు.