ప్రేమదేశం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్‌లో రూపొందనున్న ‘ప్రేమదేశం’ చిత్రం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాథ్ అబ్బాయి ఆకాష్ పూరి చిత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అజయ్, మాయ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్ర తొలి సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టారు. అనంద్ రవి గౌరవ దర్శకత్వం వహించగా జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రీకాంత్ సిద్ధం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు శేఖర్ గంగాణమోని కెమెరా అందిస్తున్నారు. నీలిమ తిరుమల్‌శెట్టి సహకారంతో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ కతుర్వ, మాయ, శివకుమార్, రామచంద్రరావు, వైశాకి, తనికెళ్ల భరణి, వెనె్నల కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శేఖర్ గంగణమోని, ఎడిటింగ్: కిరణ్ తుంపెర, నిర్మాతలు: శిరీష, నీలిమ తిరుమల్‌శెట్టి, దర్శకత్వం: శ్రీకాంత్ సిద్ధం.