సైరా కోసం భారీ సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం కోకాపేట్ దగ్గర 7 ఎకరాల్లో భారీ సెట్‌ను నిర్మించారు. 40 రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇన్ని రోజులు నెమ్మదిగా జరిగిన ఈ షూటింగ్ తాజా షెడ్యూల్‌తో ఊపందుకుంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా ముగించి కొరటాల శివ సినిమాకు సన్నద్ధం కావాలని మెగాస్టార్ భావిస్తున్నారట. సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.