కమెడియన్‌గానే ఉంటా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్‌గా తెలుగు తెరపై తనదైన ప్రత్యేకతను చాటుకున్న శ్రీనివాసరెడ్డి మరోవైపు హీరోగా కూడా ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో కమెడియన్లు హీరోలుగా మారడం ఈరోజు కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు కమెడియన్లు హీరోలుగా మారి మంచి విజయాల్ని అందుకున్నారు. అదే కోవలో శ్రీనివాసరెడ్డి కూడా గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, ఆనందోబ్రహ్మ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘జంబలకిడి పంబ’. మను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా సిద్దిఇద్నాని నటిస్తోంది. ఈ చిత్రం ఈనెల 22న విడుదలవుతున్న సందర్భంగా నటుడు శ్రీనివాసరెడ్డి చెప్పిన విశేషాలు..
జంబలకిడి పంబ..
ఈ సినిమాలో కథే హీరో. ఓ సమయంలో అబ్బాయి బాడీలోకి అమ్మాయి ఆత్మ వెళ్లడం, అమ్మాయి శరీరంలోకి అబ్బాయి ఆత్మ వెళ్లడమే అసలు కథ. ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయం పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. ఈ సినిమాలో అమ్మాయిగా నటించేందుకు హోమ్‌వర్క్ చేశాను. నరేష్, నాజేంద్రప్రసాద్, చిరంజీవిగారి సినిమాలు చూశాను. అలాగే ఇంట్లో కూడా మా ఆవిడ నైటీ వేసుకుని రిహార్సిల్స్ చేశాను. పాత్ర చేయడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ, నైటీలు, లిప్‌స్టిక్స్‌లు వేసుకుని షూటింగ్‌లో పాల్గొనడం ఇబ్బందిగా అనిపించింది.
పోలిక లేదు..
టైటిల్ వినగానే పాత జంబలకిడి పంబ సినిమా అందరికీ గుర్తొస్తుంది. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి పోలికలు లేవు. ఇందులో కేవలం హీరోహీరోయిన్లు మాత్రమే తారుమారు అవుతారు. కథ కూడా కొత్తగా వుంటుంది.
అదిముఖ్యం కాదు..
దర్శకుడు కథ చెప్పినప్పుడే బాగా నచ్చింది. ముఖ్యంగా నేటి ట్రెండ్‌కు అనుగుణంగా కథ సాగుతుంది. దర్శకుడు మనుకు ఇది రెండో చిత్రం. ఇంతకుముందు రైట్ రైట్ చిత్రం చేశాడు. అది కమర్షియల్‌గా అంతగా ఆడలేదు. అయితే దర్శకుడికి ఫ్లాపు వచ్చిందని ఆలోచించలేదు. విజయాలు, పరాజయాలు అన్నది కామనే. కానీ దర్శకుడిగా ఎలా చేయగలడన్నదే ముఖ్యం. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
గోపీసుందర్ ప్రత్యేకం..
ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా సినిమాకు ఆయనే హైలెట్. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే మిగతా టెక్నికల్ టీమ్ కూడా మంచి సహకారాన్ని అందించింది. నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
కమెడియన్‌గానే..
నేను కమెడియన్‌గానే సంతృప్తి చెందుతాను. మంచి కథలువస్తే ఇలా హీరోగా చేస్తా. అయితే నేను హీరోగా కాదు మంచి కానె్సప్ట్ చేస్తున్నాననే ఉద్దేశంతోనే ఉంటాను. పూర్తిస్థాయి హీరోగా చేయాలన్న ఆలోచనలు లేవు. కమెడియన్‌గానే పేరు తెచ్చుకోవడం నాకిష్టం.
భాగ్యనగర్ వీధుల్లో..
తెలుగులో ఉన్న 13 మంది కమెడియన్స్ కలిపి ఫ్లయింగ్ కలర్స్ అనే గ్రూపు ఏర్పాటుచేశాం. ఇందులో ఉన్నవారందరూ కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని నిర్ణయించాం. చాలామంది టాలెంట్ ఉన్నవాళ్లతో సినిమాలు చేయాలని అనుకున్నాం. తాజాగా భాగ్యనగర్ వీధుల్లో అనే సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. దానికి గమ్మత్తు అని ట్యాగ్‌లైన్ ఉంటుంది. ఒకరోజు నేపథ్యంలో కథతో ఈ చిత్రం ఉంటుంది. అలాగే ట్యాగ్‌లైన్లు మారుతూ ఉంటాయి.
తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా, రవితేజ సినిమా, పంతం, వీరభోగ వసంతరాయలు, దాంతోపాటు హీరోగా మరో సినిమా ఉంది. త్వరలోనే దాని గురించి ప్రకటిస్తా.

- శ్రీ