29న ఈ నగరానికి ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం తాజాగా చిత్ర యూనిట్ మరియు కొందరు సామాన్యులకు ప్రదర్శింపబడింది. నిర్మాత సురేష్‌బాబుగారు సినిమా చూస్తున్న ఆడియన్స్, చిత్ర యూనిట్ స్పందనను గమనించడం జరిగింది. సినిమా నడుస్తున్న సమయంలో ఆసక్తికర సన్నివేశాలు వచ్చినప్పుడు అరుపులు, చప్పట్లు కొట్టాలని చిత్ర యూనిట్ భావించింది. కాని నిర్మాత సురేష్‌బాబుగారు అందుకు నిరాకరించారు. చిత్ర యూనిట్‌కు ఆడియన్స్‌కు సంబంధం లేకుండా ఉండాలని, ఆడియన్స్ రియల్ రియాక్షన్ కావాలని సురేష్‌బాబుగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాను. సినిమా పూర్తి అయ్యింది. థియేటర్‌లో సినిమా జరుగుతోంది, నవ్వులు వినిపిస్తున్నాయి. సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. అటునుండి సురేష్‌బాబు నవ్వుతూ గర్వంగా వెళ్ళడం చూసాను. జూన్ 29న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అప్పుడు మా అసలు పరీక్ష. ఇంజినీరింగ్ పరీక్షలు పూర్తిచేసి ఐటి ఉద్యోగంచేస్తూ ఉంటే ఆ జీవితం బాగుండేది అనిపిస్తుంది. ‘పెళ్లిచూపులు’ సినిమా జూలై 29న విడుదల అయ్యింది. అది విడుదలయ్యింది నిన్ననేనా అనేలా ఉంది. శాంతి థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన రోజు గుర్తుకువస్తోంది. సినిమా చూసి బయటికి వచ్చి సురేష్‌బాబుగారు పెళ్లిచూపులు సినిమా 100రోజులు ఆడుతుందని చెప్పడం జరిగింది. నవంబర్ 5కు పెళ్లిచూపులు సినిమా 100వ రోజు. అదే రోజు నా పుట్టినరోజు. పెళ్లిచూపులు సినిమా విడుదల తరువాత సురేష్‌బాబుగారు నా రెండో సినిమా చెయ్యడానికి పూర్తిస్వేచ్ఛ ఇచ్చారు. నాకు ఆయన ఇచ్చిన ఫ్రీడం మాటల్లో చెప్పలేనిది. రెండో సినిమా ఏంచెయ్యాలి? ఏ కథ రాయాలని చాలా సంతోషించాను. చాలామంది దగ్గర సలహాలు తీసుకున్నాను. తరువాత నాకు అనిపించింది. నా గురించే నేను ఎందుకు రాసుకోకూడదు అని. తరువాత నా కథను నేను రాసుకున్నాను.