నాకిది కొత్త అధ్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, అదితీరావు హైదరి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సమ్మోహనం’. జూన్ 15న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు తండ్రి పాత్రలో నటించారు సీనియర్ నరేష్. పాత్రలకు చాలా మంది అప్రిషియేషన్స్ వచ్చాయి. ఈ సందర్భంగా చేసిన పాత్రికేయుల సమావేశంలో.. సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. ‘సుధీర్‌బాబు కెరీర్‌లోనే ‘సమ్మోహనం’ ది బెస్ట్ అవుతుందని ప్రీరిలీజ్ ఫంక్షన్‌లోనే చెప్పాను. నేను అన్నట్లుగానే సినిమా పెద్ద హిట్ అయ్యింది. పెద్ద డైరెక్టర్స్‌తోపాటు చిన్న డైరెక్టర్స్ చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. హెల్దీ మూవీస్ వస్తున్నాయి. అన్ని చిత్ర పరిశ్రమలు టాలీవుడ్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ‘సమ్మోహనం’ సినిమాను కొత్తతరహా ప్రేమకథా చిత్రమని అందరూ ఆదరిస్తున్నారు. ఇంద్రగంటిగారు నాకు కథ చెప్పగానే సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అప్పుడే చెప్పాను. నామాట నిజమైంది. అందరూ దీన్ని ఎపిక్ మూవీ అంటున్నారు. లవ్‌స్టోరీని కొత్త కోణంలో.. ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ చేసి.. దానికి డ్రామా కలిపి.. చాలా సమస్యలను టచ్ చేశారు దర్శకుడు ఇంద్రగంటిగారు. సినిమాను సినిమాగా తీస్తే సక్సెస్ కావు. సామాన్య ప్రేక్షకుడి దృష్టితో తీయాలని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఇలాంటి సినిమాలో నేను భాగమైనందుకు నటుడిగా గర్వపడుతున్నాను. రైతుకు పండిన పంట చేతికి వస్తే.. ఎంత ఆనందమేస్తుందో.. సినిమా సక్సెస్ అయితే నిర్మాతకు కూడా అంతే ఆనందం వస్తుంది. కృష్ణప్రసాద్‌గారు సినిమా చక్కగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఈ సమ్మోహనం విజయం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణగారు, నిర్మాత కృష్ణప్రసాద్‌గారికే దక్కుతుంది. నటుడిగా ఎస్.వి.రంగారావుగారిని, కమల్‌హాసన్ గారిని ఇష్టపడుతుంటాను. అందుకే విలక్షణమైన పాత్రలు నా కెరీర్ బిగినింగ్ నుండి చేస్తూ వస్తున్నాను. నా సెకండ్ ఇన్నింగ్స్‌లో దృశ్యంనుండి డిఫరెంట్ పాత్రలు చేస్తున్నాను. ఈ ఏడాది రంగస్థలం, మహానటి వంటి చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది. ఇంత మంచి పాత్రలు రావడానికి కారణం దర్శకులు. వారు నాపై పెట్టుకున్న నమ్మకం. అలాగే నా గురువు జంధ్యాలగారి ప్రభావం కూడా నాపై ఉంది. నేను పెద్ద, చిన్న సినిమాలు అని కాకుండా మంచి సినిమాలు చేయాలని చూస్తాను. కాబట్టి మంచి పాత్ర.. అది ఒక సీన్ ఉన్నా కూడా చిన్న సినిమాలో కూడా నటిస్తాను. చిన్న సినిమాలకు అందుబాటులో ఉంటాను. ఇంతకుముందు చెప్పినట్లు సుధీర్‌బాబు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ పాత్రను తను తప్ప మరొకరు చేయలేరనేలా నటించారు. అలాగే అదితిరావు హైదరి కూడా చక్కగా నటించింది. పవిత్రాలోకేష్‌కి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె చాలా చక్కగా నటించారు అన్నారు.