అందరికీ నచ్చే ఐపిసి సెక్షన్ భార్యబంధు -- నిర్మాత ఆలూరి సాంబశివరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరత్‌చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా సీనియర్ నటి ఆమని ముఖ్యపాత్రలో శ్రీనివాస్ రెట్టాడి దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ బ్యానర్‌పై ఆలూరి సాంబశివరావు నిర్మించిన చిత్రం ‘ఐపిసి సెక్షన్ భార్యబంధు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్మాత పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఆసక్తి. మా మేనమామ సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. ఆయన ద్వారా సినిమాల్లోకి రావడానికి మార్గం సుగమమైంది. అయితే కెమెరామెన్‌గా రాణించాలన్న ఆలోచన ఉండేది కానీ కుదరలేదు. దాంతో టెలికామ్ జాబ్ చేశాను. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి నిర్మాతగా ప్రవేశించాను. ఈ బ్యానర్‌లో చెంబు చినసత్యం సినిమాతో నిర్మాతగా మారాను. ఆ తరువాత నేనే ముఖ్యమంత్రి చిత్రాన్ని నిర్మించాను. ఇది మా మూడవ చిత్రం. చెంబు చినసత్యం సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ అనుభవాలతో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా విషయానికి వస్తే మహిళల రక్షణ కోసం మన రాజ్యాంగంలో పొందుపర్చిన ఓ సెక్షన్‌ని కొందరు మహిళలు ఎలా దుర్వినియోగపరచుకొంటున్నారు అనే అంశాన్ని తీసుకొని దానికి వినోదాన్ని జోడించి ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రం ద్వారా శరత్‌చంద్ర హీరోగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్ నేహా దేశ్‌పాండే కూడా అద్భుతంగా రాణించారు. అలాగే మిగతా నటీనటులు మధునందన్, వాసు, రాగిణి తదితరులు కూడా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. దర్శకత్వ శాఖలో సుధీర్ఘ అనుభవం వున్న దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే టెక్నికల్ అంశాలు కూడా హైలెట్‌గా నిలుస్తాయి. దాంతోపాటు ఆమని పాత్ర ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విజయ్ కురాకుల అందించిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేస్తున్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చేలా వుంటుంది. అలాగే మా మరో చిత్రం నేనే ముఖ్యమంత్రి కూడా త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు.