నాగశౌర్య హీరోగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన చిత్రాలను నిర్మించే సంస్థగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భవ్య క్రియేషన్స్‌కు మంచి పేరు ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘పైసా వసూల్’ తర్వాత ఈ సంస్థ తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది. ఛలో’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్యతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. కొత్తదర్శకుడు రాజా కొలుసును పరిచయంచేస్తూ భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న తొమ్మిదో చిత్రమిది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆనందప్రసాద్ సతీమణి కృష్ణకుమారి, హీరో నాగశౌర్య తల్లిదండ్రులు ఉషాబాల, శంకరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టునుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: మహతిస్వరసాగర్, ఆర్ట్: వివేక్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాజా కొలుసు.