రాహుల్-నీహారికలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్‌గా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడీ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రణీత్ బ్రహ్మానందపల్లి మాట్లాడుతూ.. ‘‘ముద్దపప్పు ఆవకాయ్’’, ‘‘నాన్నా కూచి’’ వెబ్ సిరీస్ తరువాత మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఈనెల 25నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాం. ఈ సినిమాకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అన్నారు. హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ ప్రణీత్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల శైలిలో ఈ సినిమా ఉంటుంది. నా మొదటి సినిమా ‘ఈ మాయ పేరేమిటో’ సొంత నిర్మాణ సంస్థలో చేసాను. కథ నచ్చడంతో బయటి బ్యానర్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. శివాజీరాజాగారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు’’ అన్నారు. నీహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘నీర్వాణ సినిమాస్’ ఈ సినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెడుతున్నారు. వారికి ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ప్రణీత్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా కొత్తగా తను ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’అన్నారు. ఈ చిత్రంలో..రాహుల్ విజయ్, నీహారిక కొణిదెల, శివాజీరాజా, సత్య, కోటేశ్వరరావ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి.. రచన, దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మానందపల్లి, నిర్మాత: సందీప్ యర్మారెడ్డి, సుజన్ యారబోలు, రామ్‌నరేష్, కెమెరా: హరిజ్‌ప్రసాద్, మ్యూజిక్: మార్క్ కె.రాబిన్, ఎడిటర్: రవితేజ గిరిజాల.