భక్తులకు సాయే దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిబాబు ప్రధాన పాత్రలో శ్రీనివాస్ జి.ఎల్.బి. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. భగవాన్ షిరిడీ సాయిబాబా భక్తుల అనుభవాలను ప్రధానాంశంగా తీసుకుని, బాబాను విశ్వసించిన భక్తుల జీవితాల్లో జరిగిన అద్భుతాలే ప్రధాన కథనంగా ఈ చిత్రం రూపొందించామని శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌తోపాటుగా పాటల చిత్రీకరణ పూర్తిచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఆధ్యాత్మిక చింతనతో చిత్రీకరించామని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన బాబా ఆలయాల్లో చిత్రీకరణ జరిపామని అన్నారు. అమరావతిలో ‘అండగా సాయి ఉండగా భయమెందుకురా దండగ’ అనే పాటను చిత్రీకరించామని, సాయి భక్తులకే కాక అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని, త్వరలోనే ఆడియోను విడుదల చేసి, సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రావురమేష్, ఎల్బీశ్రీరామ్, ధన్‌రాజ్, శంకరాభరణి రాజ్యలక్ష్మి, సుదీప తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: బిక్కి కృష్ణ, సంగీతం: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, నిర్మాత: పి.్భవానీ అర్జున్‌రావు, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: శ్రీనివాస్ జి.ఎల్.బి.