ఒక్క అమ్మాయికోసం తమన్ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో అంజిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్రం కోసం మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, మరో సంగీత దర్శకుడు తమన్ కథానాయకుడు ఇంట్రొడక్షన్ పాటను పాడారు. ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ, ఓ డిఫరెంట్ నేపథ్యంలో నడిచే కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని, ఈ సినిమాలో హిందీ నటుడు రవికిషన్ విలన్‌గా నటిస్తుండడం మరో విశేషమని తెలిపారు. తమన్ పాట రికార్డింగ్ పూర్తయిందని, మరో రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నామని, షూటింగ్ చివరిదశలో వుందని ఆయన తెలిపారు. అలి, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రావు రమేష్, రాహుల్‌దేవ్, పృధ్వీ, సప్తగిరి, తా.రమేష్, నళిని, జ్యోతి, రేవతి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:చోటా కె.నాయుడు, సంగీతం:మిక్కీ జె మేయర్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, పాటలు:శ్రీమణి, శ్రీశశి జోత్న్స, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాజసింహ తాడినాడ.